ఎగుమతి తనిఖీ ఏజెన్సీ (చెన్నై) ఆధ్వర్యంలో విశాఖపట్నం కార్యాలయంలో మైక్రోబయాలజీ, కెమికల్ టెస్టింగ్, జిఒఎల్ నోటిఫికేషన్, జిఎంపి, ఎన్‌ఎస్‌ఒపి, హెచ్ఎసిసిపి, దిగుమతి చేసుకునే దేశాల అవసరాలు, ఫిర్యాదుల నిర్వహణ విధానాలపై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. సిఐఎఫ్‌టి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.మధుసూదనరావు, డిప్యూటీ డైరెక్టర్ (ఇన్చార్జ్) జి. జయపాలన్,అసిస్టెంట్ డైరెక్టర్ (ఇన్-చార్జ్) సుధాంశు శేఖర్‌దాస్ సమక్షంలో, ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి వివిధ సాంకేతిక నిపుణులతో ఈనెల 16 ప్రారంభమైన శిక్షణ ముగించారు. విశాఖపట్నం,కాకినాడ రీజియన్లలోని వివిధ అనుమతి పొందిన సీఫుడ్ సంస్థల సాంకేతిక నిపుణుల ఆమోదించింది. శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు.
ముగిసిన ఎగుమతి తనిఖీ ఏజెన్సీ శిక్షణ
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)