గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేన్సర్‌ బాధితులకు ‘అప్నాఘర్‌’ అండ- ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు

6 రోజుల క్రితం

కేన్సర్‌ బాధితులకు ‘అప్నాఘర్‌’ అండ
ఉచిత వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కేన్సర్‌ చికిత్స కోసం విశాఖపట్నం వచ్చే పేద రోగులకు ఇంటాస్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ‘అప్నాఘర్‌’ అండగా నిలుస్తోంది. సిఎస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా 2023 మార్చి నుంచి నగరంలో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా కేన్సర్‌ బాధితుల కోసం ఏర్పాటు చేసిన 45 ట్రాన్సిట్‌ హోమ్‌లలో విశాఖ కేంద్రం కూడా ఒకటి. ఈ కేంద్రంలో ‌కేన్సర్‌ రోగులకు ఉచితంగా వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. రోగితో పాటు ఒక సహాయకుడు ఉండేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. చికిత్స సమయంలో రోగులకు మానసిక ధైర్యాన్ని అందించేందుకు కౌన్సిలర్‌ యశస్విని క్రమం తప్పకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో పాటు వినోద కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ప్రాజెక్టు అసోసియేట్‌గా టి.సుజాత బిస్వాస్‌ సేవలందిస్తున్నారు. రోగులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ కేంద్రం సజావుగా నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటాస్‌ సంస్థ కేన్సర్‌ బాధితుల కోసం అప్నాఘర్‌, హీమోఫీలియా రోగుల కోసం పేషెంట్‌ అసిస్టెన్స్‌ ప్రొగ్రాం నిర్వహిస్తోంది.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్