ప్రజాశక్తి -కొమ్మాది
కొమ్మాది జంక్షన్ నుంచి శివశక్తినగర్ వెళ్లే సర్వీస్ రోడ్డు మలుపు వద్ద డ్రైనేజీ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల కుంగిపోయిన మ్యాన్‌హోల్‌కు జివిఎంసి అధికారులు మరమ్మతులు చేయగా, తాజాగా దాని పక్కనే ఉన్న మరో సిమెంట్ పలక విరిగిపోయి భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మధురవాడ జోన్ జివిఎంసి ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే స్పందించి, విరిగిన సిమెంట్ పలక స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.








కామెంట్‌లు (0)