గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమి పాలనలో విశాఖ విధ్వంసం - అభివృద్ధి పేరుతో విలువైన భూములు ప్రైవేటుకు ధారాదత్తం

6 రోజుల క్రితం

కూటమి పాలనలో విశాఖ విధ్వంసం 
అభివృద్ధి పేరుతో విలువైన భూములు ప్రైవేటుకు ధారాదత్తం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 06:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​

ప్రజాశక్తి -మధురవాడ​

హైదరాబాద్, సైదరాబాద్ తరహాలో విశాఖను బే టెక్ సిటీలా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్చగా విశాఖ పరిసర కొండలను తవ్వ్వేస్తూ, సహజసిద్ధమైన ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రెహమాన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు మండిపడ్డారు. శుక్రవారం మధురవాడ శ్రీరాం ప్రోపర్టీస్ ఎదురుగా వైజాగ్ టెక్ పార్క్ పేరిట ధ్వంసం చేస్తున్న కొండ ప్రాంతాన్ని సిపిఐ బృందం సందర్శించి పరిశీలించింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ యువతకు ఉద్యోగం, ఉపాధి పేరుతో ఇక్కడ ఎనిమిది కొండలను విధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కొండలపై 40 ఎకరాలను ప్రాక్లిన్ టెంపుల్ టన్ సంస్థకు కట్టబెడితే అప్పట్లో సిపిఐ ఆందోళన చేసిందన్నారు. రుషికొండ కట్టడాలపై పర్యావరణ విధ్వంసంపేరిట గుండెలు బాదుతున్న డిప్యూటీ సిఎం పవన్‌‌కు ప్రస్తుత పరిస్థితులు కనిపించడం లేదాయని ప్రశ్నించారు. భూకబ్జాలపై సిట్‌ ‌నివేదికను బహిర్గతం చేసి, అన్యాక్రాంతమైన వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకునిప్రజల కేంద్రంగా విశాఖను అభివృద్ధి చేయాలని కోరారు. విశాఖ పరిరక్షణకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ విమల, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం మన్మధరావు, ఎన్ నాగభూషణరావు, జె అన్వేషి, బి నూకరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్