ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేటి నుంచి అమరావతి చాంపియన్షిప్ కప్ పోటీలు

8 గంటల క్రితం

sports
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 12:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అమరావతి చాంపియన్షిప్ కప్–2026 క్రీడా పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అండర్-17, అండర్-23 విభాగాల్లో బాలురు, బాలికలకు 12 క్రీడాంశాల్లో నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రస్థాయి విజేతలకు మొత్తం రూ.94 లక్షల ప్రైజ్ మనీ అందజేయనుండగా, ఆగస్టు 29న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నారు. విజయనగరం జిల్లాలో జూలై 20 నుంచి నియోజకవర్గ స్థాయి పోటీలు ప్రారంభం కానుండగా, ఆగస్టు 1 నుంచి 15 వరకు జిల్లా స్థాయి, ఆగస్టు 20 నుంచి 25 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించనున్నారు.

ఈ నెల 20 నుంచి విజయనగరం జిల్లాలో క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. తొలుతగా నియోజకవర్గ స్థాయిలో ఎంపికలు నిర్వహించి నియోజకవర్గ జట్లను నిర్ణయిస్తారు. ఆ జట్లు జిల్లాస్థాయిలో పోటీ పడతాయి. జిల్లాస్థాయి విజేతలు రాష్ట్రస్థాయి పోటీ లకు హాజరవుతారు. ఈ నెల 22వ తేదీన విజ యగనరంనియోజకవర్గానికి సంబంధించి నగరంలోని విజ్జి స్టేడియంలో పోటీలు నిర్వ హిస్తారు. 22న నెల్లిమర్ల నియోజకవర్గం సం బంధించి భోగాపురంలోని ఉన్నత పాఠశాలలో, 23న చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో, 25న గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించి బొండపల్లి ఉన్నత పాఠశాలలో నూ, 27న శృంగవరపుకోట నియోజకవర్గానికి సంబంధించి అక్కడి ప్రభత్వు ఉన్నత పాఠశాల మైదానంలోనూ, 29న బొబ్బిలి ని యోజకవర్గం రాజా కళాశాల మైదానంలోనూ, 30న రాజాం నియోజకవర్గానికి సం బంధించి అక్కడి జీసీఎస్ఆర్ కళాశా ల మైదానం, జీఎంఆర్వటీ కళాశాల మైదానంలో ఈ పోటీలు నిర్వహిం చనున్నారు.. పోటీల నిర్వహణకు సంబంధించి ఆయా నియోజక వర్గాల ఇంచార్జ్ లుగా పలువురు ఫిజికల్ డైరెక్టర్లుకు అధికారులు బాధ్యతలు అప్పగించారు. ఈ పోటీలు జిల్లా రెవెన్యూ అధికారి సత్తిబాబు, జిల్లా క్రీడాభివృద్ధిశాఖాధికారి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్