బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పూల్‌భాగ్‌ మంగళవీధి కాలనీలో రోడ్లువెడల్పు పేరుతో తొలగింపులు ఆపాలి

2 గంటల క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 03:16 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మున్సిపల్ ఆఫీస్ధ ర్నాలో పి పి ఎస్ ఎస్ కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : విజయనగరం 4వ డివిజన్ పూలభాగ్ మంగళ వీధీకాలనీ లోమున్సిపల్అధికారులుచేపట్టిన అక్రమ తొలగింపులు, అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు ఆపాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. బుధవారం మున్సిపల్ ఆఫిస్ వద్ద జరిగిన ధర్నానుద్దెశించి ఆయన మాట్లాడుతూ .. 2000 సంవత్సరం లో పేదలకి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే ఇళ్లు కట్టు కున్నారన్నారు. ముందున ఉన్న ఖాళీస్థలాలో రేకులు షెడ్లు వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, బళ్ళుపెట్టుకుని, మొక్కలు, కోళ్లు పెంచుకుని జీవిస్తున్నారన్నారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు వచ్చి రోడ్ వేడెల్పు చేస్తామని మొత్తం ఖాళీ చేసేందుకు నిన్న ప్రయత్నం చేస్తే అక్కడ ప్రజలు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయుకులు అడ్డుకున్నారన్నారు.

కావాలంటే 20 అడుగులు రోడ్లు వెయ్యండి అని చెప్పినా వినకుండా ముందు ఖాళీ చెయ్యండి అని అనడం సరైంది కాదన్నారు. తక్షణమే తొలగింపులు అపాలని ఆయన డిమాండ్ చేశారు. వాస్తవానికి ఇక్కడ 12 అడుగులు సీసీ రోడ్ వుందని, మరో 8 అడుగులు పెంచి రోడ్ వేసుకొవచ్చని అన్నారు. అంతే కాదు రోడ్లు లేవని అయ్యప్ప నగర్ ప్రజలు గోల పెడుతుంటే అక్కడ రోడ్లు వేయకుండా సీసీ రోడ్ ఉన్న దగ్గర వేడెల్పు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. పోనీ మొత్తం రోడ్డు వేస్తారా అంటే లేదు కేవలం పేదలు ఉన్న 70 ఇల్లు ముక్క మాత్రమె వేస్తాం అనడం మరీ విడ్డూరంగాఉందన్నారు. పోనీ ముందు నోటిస్ లు ఇచ్చారా అంటే అది లేదని, అడ్డుగోలుగా తొలగింపులు చేస్తామనడం సరైంది కాదని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కి సంతకాలు తో కూడిన వినతి పత్రం సమర్పించారు.

ఇళ్లు తొలగించమని కమీషనర్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి పి. రమణమ్మ, కార్యక్రమంలో పట్టణ పౌర సమక్షేమ సంఘo అధ్యక్షులు వర్రీ. రామ చంద్రరావు, మురళి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్