- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం వీటి అగ్రహారం లో 42 మంది రైతులు20 ఎకరాలు భూమిని 2004 లో మెంగో ప్రొసీసింగ్ ఇండస్ట్రీ పెడతామని అందులో భూములిచ్చిన ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పి రైతులు భూమిలుతీసుకున్నారు. నేటికి పరిశ్రమ లేదు, రైతులకు ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా అదే భూములను ప్రైవేటు వారికి అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎల్ బి జి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రైతులతో కలిసి మాట్లాడుతూ మామిడి మార్కెటి పరిశ్రమ కోసం భూమి ఇచ్చినట్టు రైతులుకి 2004 లో 42 మంది రైతులకు రైతుకి ఒక సర్టిఫికెట్ చొప్పున్న ఇచ్చారన్నారు. ఇప్పటికి 23 ఏళ్ళైనా ఇంతవరకు అక్కడ మామిడి పరిశ్రమ పెట్టలేదు,రైతులు పిల్లలకి ఉద్యోగం ఇవ్వలేదు సరికదా ప్రభుత్వం ఎప్పటికైనా పరిశ్రమ పెట్టి ఉద్యోగం ఇస్తుందని ఎదురు చూసామన్నారు. ఇప్పుడేమో ఒక ప్రయివేటు సంస్థకి లీజు కి ఇచ్చేస్తూ ప్రభుత్వం జి ఓ 576 ఇచ్చింది ఇది సరైనది కాదన్నారు. ఉద్యోగం ఇస్తామని తీసుకున్న భూములు ఉద్యోగం ఇవ్వలేదు కావున తిరిగిభూములు రైతులు కివ్వాలని శంకరరావు డిమాండ్ చేశారు. రైతులకు భూములిచే వరకు సిపిఎం రైతులకు అండగా ఉండి పోరాడుతుందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఎం దశల వారి పోరాటం చేపడుతుందని తెలిపారు. అందులో భాగంగా 10 న రౌండ్ టేబుల్ సమావేశం రైతులతో, నిర్వహించి 13 న కలెక్టరెట్ వద్ద ధర్నా నిర్వహిస్థామని తెలిపారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్ మోహన్, నగర కమిటీ సభ్యులు రంభ శ్రీను, రైతులు చుక్క పైడినాయుడు, రెడ్డి ఆదిలక్ష్మి, గురునాయుడు రమణ, మురళీ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)