ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తలపెట్టిన అమరావతి ఛాంపియన్ షిప్ జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 10,11 తేదీల్లో విజయనగరం 12 క్రీడా విభాగాల్లో జరగనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం డి ఎస్ డి ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే అమరావతి ఛాంపియన్ షిప్ నియోజకవర్గ స్థాయి పోటీలు పూర్తి కావడం జరిగిందన్నారు. నియోజకవర్గాల్లో విజేతలుగా నిలిచిన జట్లతో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. వాటిలో అథ్లెటిక్స్,బాస్కెట్ బాల్, బాడ్మింటన్,వాలీబాల్, కబడ్డీ, హాకీ, ఖో ఖో,యోగ, చదరంగం,ఆర్చరీ,.వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ వంటి 12 క్రీడా అంశాలలో ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వాటిలో అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాడ్మింటన్ విభాగాల్లో అసోసియేషన్ పోటీలు ఉండటం ఈ మూడు విభాగాల్లో పోటీలు 7 తేదీన ఎంపికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఎంపికలు విజ్జి మైదానంలో జరగనున్నాయని తెలిపారు. ఈ మూడు క్రీడమసాల్లో పాల్గొనే క్రీడాకారులు గమనించాలని 7 తేదీన హాజరు కావాలని కోరారు. అండర్ 17,23 విభాగాల్లో ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపిక పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జట్లు, క్రీడాకారులను రాష్ట్ర పోటీలకు పంపించడం జరుగుతుందన్నారు. అథ్లెటిక్, బాస్కెట్ బాల్, బాడ్మింటన్, 7 వ తేరిన వాలీబాల్, కబడ్డీ, హాకీ, ఖో ఖో, యోగ,.10 తేదీన విజ్జి మైదానంలో, చదరంగం, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ రాజీవ్ స్టేడియం లో, అండర్ 23 బాక్సింగ్ ఎంపికలు విజ్జి మైదానంలో జరగనున్నాయని తెలిపారు. జిల్లా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు బోజన వసతి సౌకర్యం తో పాటు, ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించడం జరిగిందన్నారు. పోటీలు నిర్వహణకు, బోజన వసతి సౌకర్యాలు కల్పనలు ప్రభుత్వం రూ.6 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఉదయం 8 గంటలకు క్రీడాకారులు హాజరు కావాలని కోరారు.








కామెంట్‌లు (0)