- కలెక్టరేట్ వద్ద శానిటేషన్ వర్కర్స్ వాచ్మెన్ లు ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల్లో పరిసరాల పరిశుభ్రత, తరగతి గదులు, బాత్రూం ల క్లీనింగ్ ద్వారా విద్యార్థులు అనారోగ్యాల బారిన పడకుండా పని చేస్తున్న స్కూల్ ఆయా లకు నెలకు రూ 6000/- లు చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం ఇస్తుంది. ఏప్రిల్ నుంచి 4 నెలలు బకాయిలు లు ఉండడంతో కుటుంబ పోషణ భారంగా మారి కార్మికుల తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కావున బకాయి జీతాలు చెల్లించాలని. ప్రతి నెల 5 వ తేదీ లోపు ఇవ్వాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ( సి ఐ టి యు) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ధర్నా ను ఉద్దేశించి యూనియన్ గౌరవాధ్యక్షులు ఏ.జగన్మోహనరావు మాట్లాడుతూ
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నందున కనీసం జీతం రూ. 12000/- లకు పెంచాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా విజయనగరం జిల్లాలో హై స్కూల్స్ నందు విద్యార్థులు తగ్గారనే కారణంతో అయాలను తొలగిస్తున్నారు. దీంతో సంవత్సరాల తరబడి ఈ తక్కువ వేతనంతో ఇదే జీవనాధారంగా పనిచేస్తున్న వారి జీవనాదారం పోతుందన్నారు. వీరంతా నూటికి నూరు శాతం దళిత పేద మహిళలే కాబట్టి వీరిని విధుల్లోకి తీసుకోవాలని, 100 మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించే విధంగా నిబంధనలో మార్పు చేయాలని కోరుతున్నామన్నారు.
విజయనగరం మోడల్ స్కూల్ లో 700 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. కానీ ఇద్దరు మాత్రమే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు. తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. జిల్లాలో ఉన్న హై స్కూల్స్, పట్టణాల్లో ఎలిమెంట్ స్కూల్స్ పరిస్థితి అదేవిధంగా ఉంది. నెలకి 6000/- లు అంటే రోజుకి 200 రూపాయలు, ఉపాధి హామీ దినసరి వేతనం కంటే తక్కువ కూలి, అయినా పనిచేస్తున్నారంటే ఈ ఉపాధి కూడా లేకపోవడమే ప్రధాన కారణం. పట్టణాల్లో రోజు అతను మ్చా' 200 రూపాయలతో బ్రతకడం కష్టం. రోజంతా స్కూల్ వద్ద ఉండి పని చేయాలి. కాబట్టి స్కూల్ ఆయాలు, వాచ్మెన్ వేతనం కనీసం 12 వేలకు పెంచాలని కోరుతున్నామన్నారు. ధర్నాలో శానిటేషన్ వర్కర్స్
ఎస్ కే బేగం, వై నందిని, అర్.ఉమామహేశ్వరి, ఎస్.పార్వతీ, డి.పైడిరాజు, ఫైజాన్, పి.రమణమ్మ, వి.ఆదిలక్ష్మి, జి శారద వర్కర్లు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)