సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాపోరాట రధ సారధి సిపిఎం అభ్యర్థిని గెలిపించండి : సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని

3 రోజుల క్రితం

Elect the CPM candidate—the standard-bearer of the people’s struggle: CPM District Secretary Tammineni
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజేపీ ని ఓడించండి ...

56డివిజన్ లో ఇంటింటి ప్రచారం లో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని


ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నిరంతరం ప్రజల కోసం, పట్టణ అభివృద్ధి కోసం పని చేస్తున్నా సిపిఎం పార్టీ ని గెలిపిo చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యాన్నారాయణ పిలుపునిచ్చారు. గురువారం వార్డులో నిర్వహించిన ప్రచారంలో మరింత ప్రజాసేవ చేసేందుకు సిపిఎం 56వ డివిజన్ అభ్యర్థి పాలూరి రమణమ్మ ను గెలిపించాలని పిలుపునిచ్చారు . కనపాక సాయినగర్, మహంతివీది,తారక రామ కాలనీ,సరాబుల వీది లో ప్రచారం ప్రారంభించిన తమ్మినేని, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు, దేశ, భద్రతకు, ఐక్యత కు, విగాతం కలిగించే బీజేపీ ని ఓడిoచాలని పిలుపు నిచ్చారు, అభ్యర్థి పాలూరి రమణమ్మ, సిపిఎం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రతీ ఓటర్ ను కలిశారు.పైడిమాంబకాలానిలో అక్రమ వాటర్ ప్లాంట్ కివ్యతిరేకంగా పోరాడి విజయం సాధించిoదని, అధిక ధరలు,ఆధాని విద్యుత్ మీటర్లు, చెత్తపన్నుకి వ్యతిరేకం గా పోరాటాలు సిపిఎం నిర్వహించిన దని, గత 20 ఏళ్లుగాఈపోరాటలాన్నిటిలోనూ రమణమ్మ ప్రత్యక్షంగా పాల్గొన్నారని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు,సిపిఎం నిగెలిపించండిమీకోసం పనిచేస్తాను అని 56డివిజన్అభ్యర్థి పాలూరి రమణమ్మ అభ్యర్ధన చేశారు.స్థానికo గా ఉంటూ ప్రజల కోసం పని చేస్తున్న పాలూరి రమణమ్మ ని సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్ మోహన్ నగరకమిటీ, సురేష్, వెంకటేష్ నగర కమిటీ సభ్యులు బి. రమణ, డి. రాము, రంభ శ్రీనివారావు, ,హరీష్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్