ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : హరిత ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి శుక్రవారం రింగ్ రోడ్డులోని పార్కులో మొక్కలు నాటి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “నాటిన ప్రతి మొక్క బతకాలి” అని స్పష్టం చేశారు. మనం చేస్తున్న తప్పిదాల వల్లే పర్యావరణం దెబ్బతింటోందని, దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు కార్బన్ డయాక్సైడ్‌ను న్యూట్రలైజ్ చేస్తూ, ఆక్సిజన్‌ను పెంచే మొక్కలను పెద్ద ఎత్తున నాటాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 వేల మొక్కలు నాటడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టామని, ఈ కార్యక్రమం సెప్టెంబర్ 13వ తేదీ వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి మొక్కను సంరక్షించి, అది బతికేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా, కలెక్టర్ స్పందిస్తూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదే సమయంలో ట్రాక్, పార్కు నిర్వహణ బాధ్యతను వాకర్స్ కూడా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నాటిన ప్రతి మొక్క బతకాలి : జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 12:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)