- విగ్రహాలకు ముసుగులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్: నగర పాలక సంస్థ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నగర పాలక సంస్థ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఫ్లెక్సీలు తొలగింపు,విగ్రహాలకు ముసుగులు తొడిగే పనిలో పడ్డారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు నగరంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం, వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్ టి ఆర్.రాజీవ్ గాంధీ విజయాలతో పాటు, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇతర రాజకీయ నాయకులు విగ్రహాలకు, నగరంలో అన్ని వార్డుల్లో ప్రాంతాల్లో జంక్షన్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నతకాలం ఎటువంటి రాజకీయ ఫ్లెక్సీలు పెట్టేందుకు అనుమతి లేకపోవడంతో నగరంలో టౌన్ ప్లానింగ్ విభాగంలో రెండు టీము లుగా విభజించి ప్రత్యేకంగా ప్రైవేటు మనుషులను పెట్టీ తొలగిస్తున్నారు.








కామెంట్లు (0)