ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయనగరం నుండి ఛలో ఢిల్లీకి

20 గంటల క్రితం

From Vizianagaram to Chalo Delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 02:40 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

2026 డిసెంబరు 1 నుండి కనీస వేతనం అమలు కోసం, కార్మిక హక్కుల రక్షణ కోసం ఛలో ఢిల్లీ పోరాటం...

బయలుదేరి ఢిల్లీ వెళ్లిన నాయకులు,అన్ని రంగాల కార్మికులు...


ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ : కనీస వేతనాలు అమలు కోసం,కార్మిక హక్కులు రక్షణ కోసం చలో డిల్లీ వెళ్తున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.సురేష్,జిల్లా కోశాధికారి ఏ.జగన్మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు వి.లక్ష్మి లు తెలిపారు. శనివారం ఛలో డిల్లీకి తరలి వెళ్లిన సందర్భంగా విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద వారు మాట్లాడుతూ .. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం,రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక,ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ ఒకటో తేదీ నుండి "ఢిల్లీని ఆక్రమిద్దాం" అనే నినాదంతో చలో ఢిల్లీ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్మికులకు మాత్రం వేతనాలు,జీతాలు మాత్రం గత 14సం.రాల నుండి పెంచడం లేదు.దేశంలో సర్వసంపదలు సృష్టిస్తున్న కార్మిక వర్గానికి ఉన్న హక్కులన్నీ తీసివేసి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.ఈ లేబర్ కోడ్స్న అన్ని రాష్ట్రాల కంటే ముందుగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు రక్షణ కల్పిస్తామనడం ఎంతవరకు సమంజసం? అందుకే కార్మికులకు నష్టం చేస్తున్న 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నదన్నారు.ఈ మూడు నెలల కాలంలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.25 కేజీల బియ్యం బస్తా 1300 రూపాయల నుండి 2000 రూపాయల వరకు పెరిగింది. ఇలా పప్పులు, నూనె ధరలు వంటి నిత్యవసర వస్తువుల ధరలన్నీ పెరిగాయి. కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెంచడం లేదన్నారు.ఒక కుటుంబం బతకాలంటే కనీసం 42 వేల రూపాయలు అవసరం. ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు, వైద్యం, రవాణా, విద్యుత్ చార్జీలు గణనీయంగా పెరిగాయి. ప్రజలు జీవనం సాగించలేక దుర్భర పరిస్థితికి నెట్టబడుతున్నారన్నారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న స్కీమ్ వర్కర్సలైన అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, వివోఏ, ఆర్పి, సమగ్ర శిక్ష తదితర కార్మికులతో గౌరవ వేతనం పేరు చెప్పి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. అరకొర జీతాలు మాత్రమే చెల్లిస్తున్నారు.వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు కోరుతుందన్నారు. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా వాటిని ఎక్కడా అమలు చేయడం లేదు. లక్షలాదిమంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయకుండా,సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా వారి శ్రమను దోచుకుంటున్నారు. తక్షణమే వీరందరినీ రెగ్యులరైజ్ చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నదన్నారు.దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ "నేషనల్ మానిటైజేషన్ ఆఫ్ పైపులైన్" పేరుతో ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారు. కార్మికులకు రక్షణగా ఉన్న చట్టాలు తొలగించడం వలన ఎనిమిది గంటల పని దినం బదులు 12 నుండి 14 గంటలు పని చేయవలసిన పరిస్థితి దాపురిస్తుంది. అసంఘటిత రంగ కార్మికులైన ఆటో, ముఠా, తోపుడుబళ్ళు, భవన నిర్మాణ, మోటర్ మరియు ఆన్లైన్లో పనిచేస్తున్న "గిగ్" వర్కర్లు తీవ్ర దోపిడీకి గురవుతున్నారు. వీరికి ఏ విధమైన కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సహజ వనరులైన అడవులు, గనులు, సముద్ర తీర ప్రాంతాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుంది.ఈ దోపిడీ విధానాలు ఆగాలన్నా, కార్మిక హక్కులు రక్షించుకోవాలన్నా పెద్ద ఎత్తున పోరాడడం తప్ప మరో మార్గం లేదు. గతంలో రైతులు తమకు గిట్టుబాటు ధర కల్పించాలని తమ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ ఏడాది కాలం పాటు ఢిల్లీని ముట్టడించారు. "నీట్ పేపర్" లిక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సర్ పేరుతో ఓట్ల తొలుగింపును ఆపాలని యువకులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు పోరాడుతున్నారు. కావున కార్మిక వర్గానికి నష్టం చేసి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిసెంబరు-1 నుండి "ఢిల్లీని ఆక్రమిద్దాం” నినాదంతో జరుగుతుంధి..ఢిల్లీకి బయలుదేరిన వివిధ సంఘాల నాయకులు ఏ జగన్మోహన్,సిహెచ్ వెంకటేష్,ఎం.త్రినాధ్,బి భాస్కరరావు,సిహెచ్ ముత్యాలు,కుమారి, నాగమ్మ,పాపారావు,వాసవి, శ్రీదేవి,విష్ణు,అచ్చియమ్మ,రాఘవ,ఆదినారాయణ, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
From Vizianagaram to Chalo Delhi


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్