ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు త జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం ఆమె పైడితల్లి అమ్మవారి నీ దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ .... విజయనగరం చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి, సంస్కృతికి ప్రతీక అన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దివ్య ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి కరుణాకటాక్షాలు అందరికీ అందాలని కోరుకుంటునన్నారు. సిరిమానోత్సవం భక్తి, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన హోంమంత్రి అనిత అన్నారు.
పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 11:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)