సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దమ్ముంటే నాపై ఉన్న క్రిమినల్ కేసులు నిరూపించండి : మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

3 రోజుల క్రితం

If you have the guts, prove the criminal cases against me: Former MLA Kolagatla Veerabhadra Swamy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

దమ్ముంటే నాపై ఉన్న క్రిమినల్ కేసులు నిరూపించండి ... ఎన్నికల నుంచి తప్పుకుంటా : మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

ఫేక్ న్యూస్ పై ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు


ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : దమ్ముంటే కోలగట్ల పై ఏ క్రిమినల్, చీటింగ్ కేసులు ఉన్నాయో నిరూపించాలని, 3 రోజుల్లో నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో తనపై చేస్తున్న తప్పుడు ప్రచారం పై గురువారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ .... మున్సిపల్ ఎన్నికలకు 3 రోజుల ముందు సోషల్ మీడియాలో కేసులు అంటూ వైరల్ చేస్తున్నారనీ, తమ మీద ఏ కేసులు లేవనీ అందుకే పోలీసు స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేశానన్నారు. ఏవో ధర్నాలు చేసినపుడు రాజకీయాల్లో కేసులు సహజమన్నారు. ఎన్నికలప్పుడే కోలగట్ల మీద ఆరోపణలు వస్తాయనీ గతంలో స్వామి గెలిస్తే రౌడీయిజం అని మొన్నటి ఎన్నికల్లో భూములు కబ్జా అంటూ ఆరోపించారన్నారు. రెండున్నర ఏళ్ల పాటు మీరు అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. దమ్ముంటే కోలగట్ల మీద ఏ కేసు ఉందో నిరూపించండి ... 3 రోజుల్లో ఎన్నికల నుంచి పోటీ తప్పుకుంటానన్నారు. కోలగట్ల పై ఆరోపణలు చేస్తే ఎవరు నమ్మరనీ, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారి పై, వారి వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
If you have the guts, prove the criminal cases against me: Former MLA Kolagatla Veerabhadra Swamy


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్