ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : తుఫాను ప్రభావంతో వేపాడు మండలంలో కరెంటు కోత ఏర్పడింది. దీంతో గురువారం విద్యుత్ పునరుద్ధరణ నిమిత్తం పనులు చేస్తున్న జూనియర్ లైన్మెన్ కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. వేపాడ మండలం ఎన్ కె ఆర్ పురం గ్రామంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... నల్లబెల్లి గ్రామానికి చెందిన దువ్వాడ పైడిరాజు (27) నల్లబెల్లి గ్రామం సచివాలయంలో జేఎల్ఎం గా విధులు నిర్వహిస్తున్నాడు. తుఫాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎన్ కే ఆర్ పురం గ్రామంలో విద్యుత్తు పునరుద్ధరణ నియంత్రణ పనులు చేపడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ నకు గురయ్యాడు. వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించగా, అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. వేపాడ విద్యుత్ సబ్స్టేషన్ ఏ ఈ పిచ్చయ్య అందించిన సమాచారం మేరకు వల్లంపూడి ఎస్సై సుదర్శన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కరెంట్ షాక్ తగిలి జూనియర్ లైన్మెన్ మృతి
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 04:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)