సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అవయవదానం చేసి చిరంజీవులుగా జీవిద్దాం

1 గంట క్రితం

4
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 06:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అఖిలభారత శరీర,అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ

ప్రజాశక్తి, విజయనగరం కోట : బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత మన అవయవాలను అగ్నికి ఆహుతి చేయకుండా, మట్టిలో కలపకుండా వాటిని దానం చేసి మరో 8 మంది ప్రాణాలను కాపాడి చిరంజీవులుగా జీవిద్దామని అఖిలభారత శరీర అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షిణగం శివాజీ పిలుపునిచ్చారు. ఈవినింగ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం కంటోన్మెంట్ ఉడా కాలనీ పేస్-3 పార్కులో అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మరణించిన..జీవించండి గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్థివ దేహాన్ని దానం చేసి భవిష్యత్తు వైద్యుల అధ్యయనానికి, ప్రయోగాలకు ఉపయోగపడాలని కోరారు. భారతదేశం అవయవదానంలో ఎంతో వెనుకబడి ఉందని, అవయవాలు దొరక్క ప్రతి ఏడాది వేలాదిమంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అందత్వ నివారణ సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ కే. త్రినాధరావు మాట్లాడుతూ అందత్వ నివారణకు నేత్రదానం ఒకటే మార్గమని, మరణానంతరం 6 గంటల వ్యవధిలో నేత్రదానం చేసి ఇద్దరి వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపాలని తెలిపారు. అఖిలభారత శరీర అవయవదాతల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దొంతల పాపునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈవినింగ్ వాకర్స్ క్లబ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ఆదినారాయణ, ట్రెజరర్ పిఏ రాజు,పూర్వ అధ్యక్షులు కొత్తలి ఎర్నాయుడు,టి.చిరంజీవి,కోడి మనోహర్ నాయుడు,మోహన్ దత్త,మజ్జి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్