ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ... సోమవారం మాన్సాస్ ట్రస్ట్ తరపున అమ్మవారికి పట్టువస్త్రాలను పూసపాటి అశోక్ గజపతి రాజు కుమార్తెలు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు , శ్రీమతి విద్యావతి దేవి సమర్పించారు. ముందుగా కోటలో శ్రీ ఆంజనేయ స్వామి, లక్ష్మి దేవి కోవెలలో పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుంచి ఆలయానికి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారికి ఆలయ పండితులు పూర్ణ కుంభమతో స్వాగతం పలికారు.









కామెంట్‌లు (0)