విజయనగరం జిల్లా బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల ఐక్యవేదిక నాయకులు
ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ : సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని విజయనగరంలో ఏర్పాటు చేయాలని ఎస్సీ,ఎస్టీ,బి సి సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సర్ధార్ గౌతు లచ్చన్న జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సమాజం కోసం, దేశం కోసం, ప్రజల సామాజిక వివక్ష నిర్మూలన కోసం, కార్మిక ,కర్షకుల, శ్రమజీవులు,పక్షాన నిలబడి పోరాడిన గౌతు లచ్చన్న విగ్రహం జిల్లాలో లేకపోవడం చాలా దురదృష్టకరమని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుని విగ్రహం విజయనగరం జిల్లాల ఏర్పాటు చేసి గౌతు లచ్చన్న విగ్రహాన్ని విస్మరించడం చాలా అన్యాయం అని ఆవేదన వ్యక్తంచేశారు. గౌతు లచ్చన్న జీవితాంతం ప్రజల పక్షాన నిలబడి అనేక సామాజిక రుగ్మతల మీద, వివక్షత మీద, ఉద్యమించిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. దేశ స్వతంత్ర పోరాట సమయంలో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారు అని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారి యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలుగజేసుకొని సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముద్దాడ మధు, ప్రసాదుల ప్రసాద్, కోళ్ల బలరాం మాస్టారు, నరవ అప్పారావు, ఎలాగా విజయలక్ష్మి, గొల్ల గాని రమేష్, మొదలగు వారు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)