ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : గతేడాది జూన్‌లో జామి మండలం లో సోమయాజులపాలెం గ్రామం లో విద్యుత్ సంస్థ లో విధులు నిర్వహిస్తూ విద్యుత్ షాక్ తో మరణించిన జూనియర్ లైన్ మన్ షేక్ రెహమాన్ కుటుంబానికి కోటి ఆదివారం రూపాయల పరిహారం అందించారు. ఆంద్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం 1104 యూనియన్ విజయనగరం రూరల్ బ్రాంచ్ ,రాష్ట్ర, డిస్కం,రీజనల్ నాయకులు అటు విద్యుత్ శాఖ యాజమాన్యం తోనూ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జామి, వారి తో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మరణించిన షేక్ రెహమాన్ కుటుంబానికి ఈ పరిహారం అందించింది. ఈ కార్యక్రమం లో యూనియన్ బ్రాంచ్ సెక్రటరీ నక్కాన పైడిరాజు,అధ్యక్షులు పి.మల్లికార్జునరావు,రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె వి వి కె నాగరాజు, రాష్ట్ర అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ పూసపాటి సీతారామరాజు, విశాఖ పట్నం యూనియన్ బ్రాంచ్ అధ్యక్షులు సీపాన అప్పలస్వామి, గనివాడ అప్పలనాయుడు, చలుమూరి సత్యనారాయణ(దుబాయ్) బెహరా కుర్మారావు, పతివాడ రాము నాయుడు, దేవరకొండ శ్రీనివాస్ కుమార్, సారిక మురళి, టి.గంగు నాయుడు, బి.చిరంజీవిరాజు, గొర్రెపాటి చంద్రరావు మొదలగు నాయకులు కృషి చేశారు.
విధి నిర్వహణలో మరణించిన జూనియర్ లైన్ మ్యాన్ కుటుంబానికి రూ.కోటి పరిహారం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 05, 2026, 04:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)