ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : దేశభక్తిని చాటుతూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుతో నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా "మహిళా మనోవికాస్ " నిర్వహించిన 12 కిలోమీటర్ల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం. ప్రపంచంలోనే అతిపెద్ద భారతీయ జెండాలను ప్రదర్శించబడిన దీనిలో “భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి , వివిధ దేశాల నుంచి పాల్గొని, ప్రపంచ రికార్డును సృష్టించింది. ఈ ప్రాజెక్ట్ విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియంలో ప్రదర్శించబడినది, 330 మంది మహిళలు “పాల్గొని 47,000 జాతీయజెండాలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని క్రోషేతో చేశారు. విజయనగరం నుంచి నగరానికి చెందిన ఉప్పు తనూజవల్లి, ఆమె కుమార్తె ఉప్పు క్ష్రిన్ సుభద్ర పాల్గొన్నారు. తమకు ఎంతో ఇష్టమైన క్రోషే కళను ఖాళీ సమయాల్లో తమ సృజనాత్మకతకు అనుగుణంగా వినియోగిస్తూ ఎన్నో అద్భుతమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. మహిళా మనోవికాస్ మార్గదర్శకత్వంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో క్రోషే కళ ద్వారా తమ ప్రతిభను చాటిన తల్లి, కుమార్తెకు ఇది మూడో గిన్నిస్ వరల్డ్ రికార్డు కావడం విశేషం. దేశభక్తి, సృజనాత్మకత, మహిళా సాధికారతకు ఈ విజయం ఒక చక్కని నిదర్శనంగా నిలిచింది. “ఈ అరుదైన విజయోత్సవంలో భాగమైనందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని ఉప్పు తనూజవల్లి, ఉప్పు క్ష్రిన్ సుభద్ర వ్యక్తం చేశారు. వీరి గిన్నిస్ వరల్డ్ రికార్డుల ప్రయాణం ,2023లో పొంచోస్ , తయారీతో ప్రారంభమైంది. 2024లో గ్రానీ స్క్వేర్స్ రూపొందించి రెండో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. తాజాగా 2026లో జాతీయ జెండాలను క్రోషేతో రూపొందించే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం ద్వారా మూడో గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. ఇది వారికి లభించిన మూడో గిన్నిస్ వరల్డ్ రికార్డు కావడం విశేషం.భర్త అందిస్తున్న సహకారం, ప్రోత్సాహంతో క్రోషే కళలో తమ ప్రతిభను మరింతగా అభివృద్ధి చేసుకుంటూ ఎన్నో అద్భుతమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. తమను ప్రోత్సహించిన ప్రభుత్వానికి మహిళా మనోవికాస్ సంస్థకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.


క్రోషే కళ .. తల్లి కుమార్తెకు మూడో గిన్నిస్ రికార్డు ..!
4 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 04:20 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)