ప్రజాశక్తి, విజయనగరం - ఆరుతడి పంటలకు సిద్ధం కావాలని విజయనగరం మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రావు రైతులకు సూచించారు. గురువారం మండల వ్యవసాయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ఎలెనినో ప్రభావ నివారణ చర్యలు ,ప్రణాళిక లు ఆగస్టు 7 వ తేదీ నుండి వారం రోజులు మండలంలో అన్ని గ్రామాల్లో రైతు సేవ కేంద్ర సిబ్బంది అవగాహన కార్యక్రమం లు నిర్వహించారన్నారు. మండలంలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 177.7 mm ఉండగా 159mm తో లోటు వర్షపాతం ఉందన్నారు. మండలంలో వరి పంట సాధారణ విస్తీర్ణం 4,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 1,100 ఎకరాలు పంట నాట్లు వేశారన్నారు. మిగిలిన 2,900 ఎకరాలకు సంబంధించి నారు రైతుల వద్ద సిద్ధంగా ఉన్నప్పటికీ చెరువు లలో నీరు సగం వరకు నిండే విధంగా వర్షం వస్తె గాని పూర్తి విస్తీర్ణం నాట్లు వేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటి వారం తర్వాత రైతులు వరి సాగు చేయడం శ్రేయస్కరం కాదన్నారు.
అందువల్ల ఆరు తడి పంటలైన మినుము, పెసర, చిరుధాన్యాల సాగు వైపు వెళ్లడం అవసరమన్నారు. ఇదే ప్రణాళికలు 6 రైతు సేవ కేంద్రం ల నుండి తీసుకొని మండలం ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసి జిల్లా వ్యవసాయ అధికారి వారికి సమర్పించామన్నారు.
పంటల బీమా ( ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన) కింద ఇటువంటి పరిస్థితుల్లో బీమా అవసరాన్ని రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించడం ద్వారా గ్రామాలలో అవగాహన కల్పించడం వలన మండలంలో 611 మంది రైతులు 1000 ఎకరాల పంట కు రూ.2 లక్షలు బీమా ప్రీమియం చెల్లించి రూ.4 కోట్లు కు బీమా చేయించుకోవడం జరిగిందన్నారు. ఇంకా బ్యాంక్ లలో లోన్ తీసుకున్న రైతులు ఈ నెల 31 వ తేదీ లోగా తమ లోన్ ఉన్న బ్యాంకు కి వెళ్ళి వారు వేసిన పంటకు బీమా ప్రీమియం కట్ చేయాల్సిందిగా బ్యాంకు వారిని అడిగి బీమా సౌకర్యం వినియోగించుకోవాలని సూచించారు. మండలంలో ఈ ఖరీఫ్ కు సంబంధించి ఇప్పటికే రైతు సేవ కేంద్రం ల ద్వారా 128 మెట్రిక్ టన్నులు,సహకార సంఘాలు ద్వారా 36 మెట్రిక్ టన్నులు,ప్రైవేట్ డీలర్స్ ద్వారా 24 మెట్రిక్ టన్నులు.మొత్తం 188 మెట్రిక్ టన్నులు DAP 124 మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది.రెండవ దఫా యూరియా సరఫరా నాట్లు వేసిన నెల రోజుల తర్వాత విడుదల చేయడం జరుగుతుందన్నారు.








కామెంట్‌లు (0)