సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గతం కంటే రెండు గంటలు ముందుగా సిరిమాను ప్రారంభిస్తాం

6 రోజుల క్రితం

We will begin the Sirimanu two hours earlier than in the past.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తుఫాన్ తీవ్రత సాయంత్రానికి ఎక్కువ ప్రభావం


ప్రజాశక్తి-విజయనగరం కోట : ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లమ్మ తల్లి సిరిమానోత్సవం సందర్భంగా .... మంగళవారం ఉదయం నుంచి ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో వర్షం గంటకు ఎక్కువవుతూ వస్తుంది. ఈ ప్రభావంతో అన్ని ఏర్పాట్లను ముందుగా చేసినట్లు విజయనగరం డిఎస్పి బి లక్ష్మణుమూర్తి తెలిపారు. భారీ గేట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ .... తుఫాన్ ప్రభావంతో సిరిమానోత్సవం గతం కంటే రెండు గంటల ముందే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తుఫాన్ తీవ్రత ఎక్కువ అవుతున్న సందర్భంగా సాయంత్రానికి మరి తీవ్రత ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉండడంతో ఈ సిరిమాను సంబరాన్ని ముందుగా నిర్వహిస్తే సాయంత్రం యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. పోలీస్ బందోబస్తుపరంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ గస్తీలు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
We will begin the Sirimanu two hours earlier than in the past.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్