ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : విజయనగరంలో పోలింగ్ 50 శాతం దాటలేదు. దీంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ ఏర్పడింది. డివిజన్ల పెంపుతో ఓటర్లు తిప్పలుపడ్డారు. ఓటర్ల వివరాల్లో మార్పులు.. స్లిప్పుల పంపిణీలో లోపాలు ఏర్పడ్డాయి. తమ ఓటు ఎక్కడుందో తెలియక ఓటర్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓటర్లకు అవగాహన కల్పించే విషయంలో అధికారులు, రాజకీయ నేతలు విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. ఓటర్ల నిరాసక్తతా..? అధికారుల నిర్లక్ష్యమా..? అనే ప్రశ్నలు తలెత్తాయి. తక్కువ పోలింగ్ తో రాజకీయ పార్టీల్లో కలవరం రేగింది. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సమయంలో ... డి.సత్య మాదిరి 37వ వార్డు లో 9 నెలల గర్భవతి, ఈ రోజే డెలివరీ కి సిద్ధమవుతున్న మహిళ. ఆమె తన ఓటు హక్కును సన్ స్కూల్ పోలింగ్ బూత్ లో వినియోగించుకున్నారు. ఈమె హైదరాబాద్ లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆ మహిళ సంకల్పించి ఓటు వేశారు.
ఎందుకీ నిస్తేజం..? - విజయనగరంలో 50 శాతం దాటని పోలింగ్
19 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026, 04:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)