దర్శకుడు అజర్ లోకల్ టాలెంట్‌తో స్థానికంగా రూపొందించిన సినిమా ‘కొత్త సినిమా’. ఈ సినిమాతో వంద మంది న్యూ టాలెంట్ టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. సురేశ్, రాకేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రానికి అజర్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌తో పాటు డైలాగ్స్, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. అజర్ ‘కొత్త సినిమా’ అనే టైటిల్ పెట్టడమే కాదు, కొత్త ప్రయత్నం కూడా చేశాడు. అజర్ తన ఊరికి వెళ్లి, అక్కడి టాలెంట్‌ను గుర్తించి, వారికి శిక్షణ ఇచ్చి అక్కడే సినిమా రూపొందించాడు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన సినిమా చేసి ఉంటాడని నమ్ముతున్నాను.’’ అన్నారు. దర్శక నిర్మాత ఎన్. శంకర్ మాట్లాడుతూ.. అజర్ ... వంద మీటర్ల లోతుకు వెళ్లి పనిచేసే బొగ్గు బావి ప్రాంతం సింగరేణి నుంచి వచ్చిన టెక్నీషియన్. ఈ చిత్రంతో ఎంతోమంది కొత్త వారికి అవకాశం కల్పించడం అభినందనీయం. ‘కొత్త సినిమా’ నిజంగానే కొత్తగా ఉండి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
స్థానిక ప్రతిభతో ‘కొత్త సినిమా’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 08:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)