శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘జార్జ్ క్రిష్‌’లో రెట్రో మాస్‌ సాంగ్‌!

47 నిమిషాల క్రితం

‘జార్జ్ క్రిష్‌’లో రెట్రో మాస్‌ సాంగ్‌! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 08:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శర్వానంద్‌ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జార్జ్‌ క్రిష్‌’. ఈ సినిమా నుంచి దర్శకుడు తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. ఇందులో మాస్‌ ప్రేక్షకులను అలరించేలా ఓ రెట్రో పాటను సిద్ధం చేస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ పాట అభిమానులకు పండగలా ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇందులో మానస వారణాసి కథానాయికగా నటిస్తుండగా, శర్వానంద్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్