గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెంకటేష్ బర్త్‌డేకి ...

2 గంటల క్రితం

వెంకటేష్ బర్త్‌డేకి ... image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 06:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వెంకటేష్, కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'జనవరి 12 విడుదల'.. 'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనేది ట్యాగ్‌లైన్‌. ఇటీవల ఈ సినిమా నుంచి 'డివికి డివికి' ఫస్ట్ సింగిల్ విడుదలైంది. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాత సాహు గారపాటి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, మరో వారం నుంచి పది రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని చెప్పారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 1 వరకు చిత్రబృందం అమెరికాలో పర్యటించి అక్కడి ప్రేక్షకులను కలవనుంది. టీజర్ విడుదల తరువాత నెల రోజుల పాటు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్మాత వెల్లడించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్