కొత్త నటీనటులు శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటిస్తున్న ‘చకోర–లూనార్ లవ్ బర్డ్’ అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రంలోని ‘అద్దంలా చేయనా..’ పాటను అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్ విడుదల చేశారు. ప్రిన్స్ హెన్రీ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, సాయి చరణ్ భాస్కరుణి ఆలపించారు. ప్రేమికుడి మనసులోని భావాలను ఆవిష్కరిస్తూ ఈ పాట ఆకట్టుకుంటోంది. మంగా శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీఐపీ వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ సారథ్యంలో హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్‌పై డా. చింతాడ హేమారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మంగా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
‘అద్దంలా చేయనా’ పాట విడుదల
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)