బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆజాద్ హింద్ ఫౌజ్ నేపథ్యంలో...

1 గంట క్రితం

og 2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓజీ’పై అప్‌డేట్ వచ్చింది. బుధవారం (సెప్టెంబర్ 2) పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘ఓజీ యూనివర్స్’ పేరిట ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్ కలిసి ‘ఓజీ యూనివర్స్’ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కీలకమైన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ కాలం నుంచి నేటి వరకు జరిగిన పలు కీలక సంఘటనల ఆధారంగా ఈ కథ రూపుదిద్దుకుందని పవన్ స్పష్టం చేశారు. గతంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ చిత్రాలను మించి అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్