గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అల్లకల్లోలంగా’ పాట విడుదల

1 గంట క్రితం

gaja 2.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 08:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‘గజ’ చిత్రంలోని ‘అల్లకల్లోలంగా’ పాటను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు సాయి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘గజ’ టీజర్ ఇంప్రెసివ్‌గా ఉందని, ఎన్ని సవాళ్లు ఎదురైనా సినిమాను వదలకుండా సతీష్ జై కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారని ప్రశంసించారు. మణిశర్మ ట్రాక్ క్వాలిటీని ఎవరూ బీట్ చేయలేరని, ‘గజ’ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. హీరో, దర్శకుడు, నిర్మాత సతీష్ జై మాట్లాడుతూ, ఈ సినిమాకు మణిశర్మ బ్యాక్‌బోన్‌లా నిలిచారని, ఆయన నుంచి క్రమశిక్షణ, డెడికేషన్ నేర్చుకున్నానని తెలిపారు. ‘గజ’లో కమర్షియల్ అంశాలతో పాటు సెల్యూట్ కొట్టేలా మంచి మెసేజ్, ఎమోషన్ ఉంటాయని చెప్పారు. మణిశర్మ మాట్లాడుతూ, ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కొని సతీష్ ఈ చిత్రాన్ని రూపొందించారని, సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. ‘అల్లకల్లోలంగా’ పాట కూడా అద్భుతంగా కుదిరిందని చెప్పారు. నిర్మాత మైత్రి శరణ్, ఫర్నాజ్ శెట్టి కూడా మాట్లాడారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్