అనిల్ రావిపూడి, వెంకటేష్, కల్యాణ్ రామ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ చిత్రం ‘జనవరి 12 విడుదల’. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్ల లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే తెలుగు ప్రేక్షకులతో పాటు ఓవర్సీస్ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునేలా చిత్రబృందం అమెరికాలో భారీ ప్రమోషనల్ టూర్‌కు శ్రీకారం చుట్టింది. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రమోషనల్ ఈవెంట్లలో ఒకటిగా నిలవనున్న ఈ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 26, 27 తేదీల్లో చికాగోలో, డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో ఆస్టిన్, డల్లాస్ నగరాల్లో చిత్రబృందం సందడి చేయనుంది. అభిమానులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకోనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ అనీల్ రావిపూడి ‘అమెరికా, గత కొన్నేళ్లుగా మీరు మాపై కురిపించిన ప్రేమకు, అందించిన మద్దతుకు ధన్యవాదాలు.. మీరు మాపై చూపిన అపారమైన ప్రేమకు ప్రతిగా, మిమ్మల్ని నేరుగా కలిసేందుకు మేము వస్తున్నాము. త్వరలోనే కలుద్దాం’ అని ట్వీట్ చేశారు. కాగా.. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీబీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
‘అమెరికా.. మేము వస్తున్నాం..’
10 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 07:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)