దర్శకుడిగా ప్రేక్షకులను నవ్వించిన అనిల్ రావిపూడి ఇప్పుడు నటుడిగా తెరపై కనిపించనున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్‌సేన్ కథానాయకుడిగా రూపొందుతున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ENE Repeat’లో ఆయన ప్రత్యేక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో దర్శకుడి పాత్రలోనే కనిపించనున్నారని, రెండు కీలక సన్నివేశాల్లో కొద్దిసేపు తెరపై సందడి చేయనున్నారని తెలుస్తోంది. నవంబరు 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో విశ్వక్‌సేన్ ఫిల్మ్‌మేకర్‌గా కనిపించనున్నారు. అభినవ్ గోమటం, అనీషా అంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. రూట్ నోడ్ సినిమా, ఎస్ ఒరిజినల్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.
తెర పైకి అనిల్ రావిపూడి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)