ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఇడుపు కాయితం`. బన్నీ వాస్, సుకుమార్ నిర్మాణంలో వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇప్పటికే విడుదలైన 'శ్రీలత` పాట విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా నవంబర్ 20న మరో పాటను 'గోగులు గోగులు` పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు కొంగరి కృష్ణ సాహిత్యం అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు. గాయని కనకవ్వ ఆలపించారు.
‘ఇడుపు కాయితం’ నుంచి 20న మరో పాట
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 06:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)