శర్వానంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘భోగి’ చిత్రం విడుదల వాయిదా పడింది. ఆగస్టు 28న థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని వెల్లడించారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 1960ల నాటి ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో ఈ కథ సాగనున్నట్లు సమాచారం. శర్వానంద్ ఇందులో ‘గంగా’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సినిమా క్లైమాక్స్ కోసం చిత్రబృందం 30 రోజుల పాటు భారీ యాక్షన్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్ పనులు ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో రిలీజ్ డేట్‌ను వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.
‘భోగి’ విడుదల వాయిదా
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 09:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)