శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘చంద్రయాన్’ నవంబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు పది రోజుల సమయం మాత్రమే ఉండటంతో చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. మరో పది రోజుల్లో ప్రేక్షకులను నవ్వించడానికి ‘చంద్రయాన్’ సిద్ధమైందంటూ ఈ పోస్టర్ ద్వారా తెలిపింది. శివకుమార్ దీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, ‘బలగం’ సత్యనారాయణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ మొలక నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల సమర్పిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కూడా దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖరే అందించారు. హర్ష ప్రవీణ్ సంగీతం సమకూర్చారు.
13న ‘చంద్రయాన్’ విడుదల
2 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 05:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)