సోమవారం, 13 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్రైమ్ కామెడీగా ‘చోర శిఖామణులు’

1 గంట క్రితం

chorasikhamanulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 13, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘చోర శిఖామణులు’. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు నక్కిన త్రినాథరావు, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్ మూహర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ సినిమా ఆనంద్ కుర్మా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. శ్రీకరి-వివాన్ సమర్పణలో శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ మీద బానూరు నాగరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నరేశ్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, అప్పు, కరణ్, జబర్దస్త్ సత్య శ్రీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆనంద్ రాజావిక్రమ్ సంగీతం అందిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్