మహ్మద్ సాయీద్ సమి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం 'కూల్ రాకీ కూల్'. చాయాదేవి కథానాయికగా నటిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. తాజాగా హైదరాబాద్‌లో టైటిల్, పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సమి మాట్లాడుతూ.. తన జీవితంతో పాటు స్నేహితుల అనుభవాల ఆధారంగా కథ రాసుకున్నానని, కర్నూలు నేపథ్యం, స్థానిక యాస, భాషతో సినిమా రూపొందుతోందని చెప్పారు. ఈ టైటిల్ వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉందన్నారు. రవితేజ నటించిన 'దుబాయ్ శీను' సినిమాలో బ్రహ్మానందం చెప్పే 'కూల్ రాకీ కూల్' డైలాగ్ మీమ్‌గా ప్రాచుర్యం పొందింది. ఆ డైలాగ్‌నే సినిమా టైటిల్‌గా పెట్టినట్లు వివరించారు. త్వరలోనే టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Print Edition'కూల్ రాకీ కూల్' టైటిల్ పోస్టర్ విడుదల
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 06:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)