వారాహి ఆర్ట్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ టేకుమూడి, రాధికా జోషి, సుప్రియా చవాన్ ప్రధాన పాత్రలుగా జీడీ నరసింహా తెరకెక్కిస్తున్న చిత్రం ‘డియర్ హార్ట్’. ఈ సినిమాలో సురేష్ గురు, పృథ్వీరాజ్, సత్య ప్రకాష్, జబర్దస్త్ నూకరాజు, జగదీశ్వరి తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ రిలీజ్ చేశారు. యూత్‌ఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రానున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సినిమాకు అరవింద్. బి కెమెరామెన్‌గా, ఎస్. సుహాస్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. త్వరలోనే మూవీకి సంబంధించిన ఇతర అప్‌డేట్‌లను ప్రకటించనున్నారు.
‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 09:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)