గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

శ్రీదేవి బయోపిక్‌పై చర్చ

1 గంట క్రితం

sreedevi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

శ్రీదేవి జీవితంపై బయోపిక్‌ రాబోతోందన్న చర్చ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో 54 ఏళ్ల వయసులో ఆమె కన్నుమూశారు. ఆమె జయంతి సందర్భంగా నటి ప్రియాంక చోప్రా శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకానికి సంబంధించిన అప్‌డేట్‌ను పంచుకున్నారు. ధీరజ్‌ యు. కుమార్‌ రాసిన ‘ఎంప్రెస్‌–ది డెఫినిటివ్‌ బయోగ్రఫీ ఆఫ్‌ శ్రీదేవి’ పుస్తక ముఖచిత్రాన్ని ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘మీరు ఎంతో గుర్తుకొస్తున్నారు.. శ్రీదేవి త్వరలో వస్తోంది’ అని ప్రియాంక పేర్కొన్నారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ ఈ పోస్ట్‌ను ఎక్స్‌లో రీపోస్ట్‌ చేయడంతో బయోపిక్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు శ్రీదేవి బయోపిక్‌ గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. బాలనటిగా కెరీర్‌ ప్రారంభించిన శ్రీదేవి తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో అగ్ర కథానాయికగా ఎదిగారు. ఆమె సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తే, ఆమె పాత్రలో ఎవరు కనిపిస్తారు, దర్శకత్వ బాధ్యతలు ఎవరు చేపడతారన్నదీ తెలియాల్సి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్