ఎనిమిదేళ్ల క్రితం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా ‘ENE Repeat’ ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబరు 19న థియేటర్‌లలో విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ట్రైలర్‌లో పాత స్నేహితుల బృందం మరోసారి తమదైన హాస్యంతో సందడి చేయడం కనిపిస్తోంది. ఈసారి కూడా వినోదానికి కొదవ ఉండదని ట్రైలర్ సూచిస్తోంది. విశ్వక్‌సేన్, శ్రీకాంత్ మాగంటి, అభినవ్ గోమటం, వెంకటేశ్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా పతాకాలపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘ఈఎన్‌ఈ రిపీట్’ ట్రైలర్
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 03, 2026, 08:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)