ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటిస్తున్న కొత్త చిత్రం ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదలవుతోంది. చిత్ర ప్రచారంలో భాగంగా తాజాగా ‘మనసా వాచా’ అంటూ సాగే లిరికల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. హేషమ్ అబ్దుల్ వాహబ్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు శ్రీహర్ష సాహిత్యం అందించారు. ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర ఆలపించారు. ఆదిత్యహాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘ఎపిక్...’ లిరికల్ సాంగ్ ‘మనసా వాచా..’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 20, 2026, 09:16 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)