హీరో అఖిల్ ఉడ్డెమారి నటించిన 'ఫైట్ మహా' చిత్రం టీజర్‌ను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏవీఎస్ రాజు నిర్మించారు. హాస్య నటుడు సునీల్ ఇందులో కీలక పాత్ర పోషించగా, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ భరత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ, "'ఫైట్ మహా' ఒక వినూత్నమైన సైకాలజికల్ థ్రిల్లర్. ఈ కథ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచుతుంది. జీవితంలో నిరాశకు లొంగిపోకుండా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోరాడుతూనే ఉండాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందిస్తున్నాం" అని తెలిపారు. చిత్ర విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది.
Print Edition‘ఫైట్ మహా’ టీజర్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 15, 2026, 08:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)