గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో ‘కాకా’ ఫస్ట్‌ సింగిల్‌

16 గంటల క్రితం

అమెరికాలో ‘కాకా’ ఫస్ట్‌ సింగిల్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 07:27 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘కాకా’ చిత్రంలోని తొలి పాటను అమెరికాలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు తమన్‌ వెల్లడించారు. వచ్చే నెలలో ఫస్ట్‌ సింగిల్‌ విడుదల కానుందని, ఈ కార్యక్రమం కోసం చిరంజీవి అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవితో కలిసి సినిమా సెట్‌లో దిగిన ఫొటోను తమన్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అయితే పాట విడుదల తేదీని వెల్లడించలేదు. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌లో భారీ సెట్‌ వేసి రామ్‌-లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. స్నేహ, అనస్వర రాజన్‌, నివేదా పేతురాజ్‌, గెటప్‌ శ్రీను, అనురాగ్‌ కశ్యప్‌ తదితరులు నటిస్తున్నారు. కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్