విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఇంజి వెల్లం' (అల్లం బెల్లం). వచ్చే ఏడాది జనవరి 29న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా 'ఆచి ఆచి' అనే తొలి పాటను తాజాగా విడుదల చేసింది. ఈ పాటలో సాయిపల్లవి గర్భిణిగా కనిపిస్తూ, ఇతర గర్భిణులతో కలిసి ఆడిపాడారు. వైశాలి, శరణ్య శ్రీనివాస్ ఈ పాటను ఆలపించగా, ఇళంగో కృష్ణన్ సాహిత్యం అందించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. సుభాస్కరన్, మణిరత్నం, శివ అనంత్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'ఇంజి వెల్లం' తొలి పాట విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 26, 2026, 07:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)