మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'గోల్డెన్ భాగ్యం` పేరు ఖరారు

9 గంటల క్రితం

'గోల్డెన్ భాగ్యం` పేరు ఖరారు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 06:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టాలీవుడ్‌, కోలీవుడ్‌ కమెడియన్లు సత్య, యోగిబాబు కలిసి నటిస్తోన్న చిత్రానికి ‘గోల్డెన్‌ భాగ్యం’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. తాజాగా టైటిల్‌ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ‘రంగబలి’ ఫేమ్‌ దర్శకుడు పవన్‌ బాసంశెట్టి తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి ఈయన సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో లవ్‌, క్రైమ్‌, యాక్షన్‌ సన్నివేశాలు కూడా ఉంటాయని దర్శకుడు ఈ గ్లింప్స్‌లో రివీల్‌ చేశారు. ఇందులో వెన్నెల కిషోర్‌, సుదర్శన్‌, రోహిణి, తనికెళ్ల భరణి, సునీల్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌ సి.హెచ్‌. సంగీతం అందిస్తున్నారు. డ్రీమ్‌ మూవీ మేకర్స్‌, నయవాయు చిత్రాల బ్యానర్లపై నాగార్జున రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, బాపి రెడ్డి, పవన్‌ బాసంశెట్టి సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్