ఎస్. కృష్ణ నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘హై’. అనన్య శర్మ, పల్లవి డోరా, సాయికృష్ణ, రేవంత్ కీలక పాత్రలు పోషించారు. డబ్బు, మద్యం వెనుక పడే మనుషుల మనస్తత్వం, ప్రేమికుడి ప్రమాదకరమైన బెట్టింగ్‌లు, ఆత్మగౌరవం కోసం పోరాడే ఓ యువతి కథాంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైరా ప్రజెంట్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎస్. కృష్ణ, హరీష్ పెద్ది, శేఖర్ దివ్వెల నిర్మించారు. నవంబర్ 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా విడుదల తేదీ పోస్టర్‌ను ఆవిష్కరించింది. ‘ఎక్కడా చూడని కిక్కిచ్చే వినోదంతో, గందరగోళం నిండిన ఉత్సాహానికి సిద్ధం అవ్వండి’ అనే క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను విడుదల చేసింది.
నవంబర్ 27న ‘హై’ విడుదల
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 28, 2026, 07:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)