బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తల్లి కావాలని కలలు కన్నా : సమంత

5 గంటల క్రితం

samanta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

స్టార్ హీరోయిన్ సమంత మాతృత్వంపై చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుం టున్నాయి. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె, తల్లి కావాలనే కోరిక తనకు చాలా కాలంగా ఉందని తెలిపారు. "ప్రతి మహిళ జీవితంలో మాతృత్వం ఎంతో కీలకమైన దశ. ఈ క్షణాన్ని అనుభవించాలని చాలా కాలంగా కలలు కన్నాను. ఇప్పుడు ఆ అందమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ కొత్త బాధ్యత నాకు కొత్త శక్తిని, కొత్త ఆలోచనలను ఇచ్చింది" అని చెప్పారు. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించి కూడా సమంత మాట్లాడారు. తాను నటించిన సినిమాను 20 ఏళ్ల తర్వాత చూసి ఎవరైనా ఆనందిస్తే, అదే తనకు గొప్ప అవార్డుతో సమానమని పేర్కొన్నారు. తనను రిస్క్‌ తీసుకునే నటిగానూ, మంచి కథలను నమ్మిన నటిగానూ ప్రేక్షకులు గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్