బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది : నాగార్జున

2 గంటల క్రితం

Nagarjuna_Akkineni
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ప్రెస్‌మీట్‌లో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున మీడియా వ్యవస్థలో వచ్చిన మార్పులపై స్పందించారు. "నా కెరీర్ ప్రారంభంలో సినిమా విడుదలకు ముందు కొద్దిమంది జర్నలిస్టులు, ఒక ఫొటోగ్రాఫర్ మాత్రమే ఉండేవారు. ఫోన్లు, లైవ్ రికార్డింగ్‌లు, సోషల్ మీడియా అప్పట్లో లేవు. మీడియాతో ప్రశాంతంగా మాట్లాడే అవకాశం ఉండేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏం మాట్లాడినా వెంటనే వైరల్ అవుతోంది. మీడియా ముందు ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంటుంది. ఎవరు ఏ ప్రశ్న అడుగుతారో, ఎక్కడ ఏ కెమెరా రికార్డ్ చేస్తుందో తెలియదు. చిన్న మాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే చాలాసార్లు ఏం మాట్లాడాలో ఆలోచిస్తూ ఫ్రీజ్ అయిపోతుంటాం" అని నాగార్జున అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్