‘సుడిగాడు’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మలి’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మోనాల్ గజ్జర్ ఇటీవలి కాలంలో ‘పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా’ అనే థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత తాను ఎంతో ధైర్యంగా చికిత్స తీసుకున్నట్లు చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిందని, ప్రస్తుతం కోలుకుంటున్నానని, ఆరోగ్యం మెరుగ్గా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. వీడియోలో మాట్లాడుతూ.. ‘జీవితంలో ఏది ముఖ్యం కాకపోయినా, మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు ఉండటమే అసలైన సంపద. బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా చాలామంది తమ ఆరోగ్యాన్ని తేలికగా నిర్లక్ష్యం చేస్తారు. ఈ అనారోగ్య అనుభవం ఆ నిర్లక్ష్యాన్ని తనకు కళ్లకు కట్టినట్లు తెలిపింద’ని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిఒక్కరూ ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, మహిళలందరూ ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆమె.. ముందస్తు జాగ్రత్తగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని సలహా ఇచ్చారు.
క్యాన్సర్ నుండి కోలుకున్నాను..
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 12, 2026, 06:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)