బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపరిశ్రమ నుంచే అది నేర్చుకున్నా : శ్రుతిహాసన్

2 గంటల క్రితం

shruthi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 07:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ తన 17 ఏళ్ల సినీ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తన సోలో మ్యూజిక్ ఆల్బమ్ విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘సినిమా రంగంలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. విమర్శలను, సవాళ్లను తట్టుకుని పట్టుదలతో నిలబడడం ఎలాగో సినీ పరిశ్రమ నుంచే నేర్చుకున్నాను. నా 17 ఏళ్ల సినీ జీవితంలో ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా వాటిని అధిగమించే ఆత్మవిశ్వాసాన్ని, దృఢత్వాన్ని ఈ రంగం నాకిచ్చింది’’ అని అన్నారు. ప్రస్తుతం శ్రుతిహాసన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శృతి ఒకవైపు కీలక పాత్రల్లో నటిస్తూనే, మరోవైపు ప్రైవేట్ ఆల్బమ్‌లలోనూ పాటలు పాడుతున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్